Top Tag

పత్రికా ప్రకటన

రాజమహేంద్రవరం : తేదీ : 2.6.2023

రైతుల పక్షపాతి మన జగనన్న …

నిన్న రైతు భరోసా… నేడు ఆధునిక యంత్ర పరికరాలు

* రైతాంగ సంక్షేమానికి వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం

* ట్రాక్టరు ను నడిపిన మంత్రి, ఎంపి, డిసిసిబి చైర్మన్, జాయింట్ కలెక్టర్ లు

– ‘వైఎస్సార్ యంత్ర సేవా పథకం’ మెగా మేళా 2.0 లో పాల్గొన్న హోం మంత్రి, ఎంపీ భరత్ రామ్

రాష్ట్రంలో నేడు రైతులు వ్యవసాయాన్ని నేడు పండుగగా జరుపుకోవడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అయిందని హోం మంత్రి డా తానేటి వనిత, ఎంపి మార్గని భరత్ రామ్ లు పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం లాలా చెరువు ప్రాంతంలో వైఎస్సార్ విగ్రహం వద్ద నిర్వహించిన ‘వైఎస్సార్ యంత్ర సేవా పథకం’ మేగా మేళా-2.0 కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్ రామ్ లతో పాటు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సభ వేదిక సమీపంలో వున్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధి హోం మంత్రి డా తానేటి వనిత మాట్లాడుతూ, గత పాలకుల సమయంలో వ్యవసాయాన్ని దండగా అంటే, జగనన్న ప్రభుత్వం గత నాలుగేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగగా చేసి, రైతులు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రైతులు సకాలంలో పంటలు వేసేందుకు తగిన సూచనలు సలహాలు ఇచ్చేందుకు గ్రామ స్థాయి లో అర్భికెలను ఏర్పాటు చేశారన్నారు. ముందస్తుగా ఖరీఫ్ సాగు నీటిని విడుదల చేయడం ద్వారా అక్టోబర్, నవంబర్ నెలలో వచ్చే తుఫానులు, వరదల బారిన పంటలు పడకుండా పంటను రక్షించడం సాధ్యం అయిందన్నారు. ముందు గాపంట వెయ్యడం తో సకాలంలో నూర్పిడి చేసి కొనుగొలు కు ఆస్కారం కలిగిందని మంత్రి తెలిపారు. అర్భికే ద్వారా మెరుగైన వ్యవసాయ పద్ధతులు, అనుబంధ యంత్ర పరికరాలు అందిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కిందన్నారు.

పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ జిల్లాలో 166 సి హెచ్ సి గ్రూపులకు రూ.5.96 కోట్లు విలువజేసే 103 ట్రాక్టర్లు, 15 హార్స్పవర్స్ గల 15 వ్యవసాయ యంత్ర పరికరాలను స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. . ఈ సందర్బంగా నిర్వహించిన సభలో ఎంపీ భరత్ మాట్లాడుతూ కొందరు అమలుకు నోచుకోని శుష్క వాగ్దానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు . గతంలో కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని విషయాన్ని రైతులు, ప్రజలు గ్రహించాలని ఎంపి తెలిపారు. దివంగత వైఎస్ఆర్ రైతులకు ఉచిత విద్యుత్తు ప్రకటిస్తే , విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్పిస్తే మరిదేనికీ పనికిరావన్న మాటలను ఈ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. వ్యవసాయ అధికారంలోకి వచ్చాక జగనన్న పేదలకు అందజేసే సంక్షేమ పథకాలపైనా అనేక విమర్శలు గుప్పించారని ఎంపీ భరత్ రామ్ అన్నారు. ఎలాగైనా అధికారం లోకి రావడం కోసం శుష్క వాగ్దానాల మేనిఫెస్టో చూస్తే అవగతం అవుతోందని అన్నారు. జగనన్న ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు కాపీ చేస్తున్నట్లు ఆరోపించారు. ‌సీఎం జగన్ మాట ఇచ్చారంటే అమలు చేస్తారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. గత పాలకులు ఇచ్చిన వాగ్దానాలలో ఎన్ని అమలు చేశారు, ఎంత వరకూ నెరవేర్చారో ప్రజలు గ్రహించాలని కోరారు. ప్రతిపక్ష నేత రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తాననడం పచ్చి మోసపూరిత ప్రకటన అన్నారు. సీఎం జగనన్న రైతు భరోసా ను గత నాలుగేళ్లు గా రైతుల ఖాతా రూ.13,500 లు ఇస్తున్నారని, ఆమేరకు ఈ ఏడాది తోలి విడత గా రూ.7500 వైయస్ఆర్ భరోసా, పిఎం కిసాన్ యోజనా కింద జూన్ ఒకటిన జమ చేసినట్లు తెలిపారు. అలాగే వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.129 కోట్లు సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంకు అకౌంట్స్ ద్వారా ట్రాక్టర్లు, రైతులకు ఉపయోగపడే వివిధ పరికరాలను అందజేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. గుంటూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించగా, అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పవాహనాలు పంపిణీ అవుతున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యుడు తేజా, జేసీ ఎన్ తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ . మాధవరావు, స్థానిక నేతలు పాలిక శ్రీను, గిరజాల బాబు తదితరులు పాల్గొన్నారు.

——————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.

The Pulse of Washington D.C.

You may also like

© 21st Century Rich TVX America News